ప్రాంతీయం

గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం …

143 Views

ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 14, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం పూజారులు వేణుగోపాల్ సుకుమార్ ఆలయ ప్రధాన అర్చకులు మణిహారం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని వారు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో చిటినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్ రాజిరెడ్డి లక్ష్మి దంపతులు, సర్పంచ్ సరిత శ్రీనివాసరావు, దంపతులు గ్రామ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, వార్డు సభ్యులు జిల్లెల్ల మల్లేశం, బొప్పా వెంకట రమణ, బప్ప విష్ణు, మాజీ ఎంపీటీసీ లింగంపల్లి ఏళ్ల గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహించారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్