గ్రామ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి..
సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో..
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30
కడవేర్గు సిపిఎం పార్టీ సభ్యులు కార్యకర్తలు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై ఐక్యంగా,పట్టుదలతో పోరాడితే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు. సోమవారం రోజున సిపిఎం పార్టీ గ్రామ శాఖ మహాసభను జయప్రదం కావాలని కడవేర్గు బస్టాండ్ వద్ద గల సిపిఎం జెండాను కొంగరి వెంకట మావో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆరుట్ల మల్లేశం అధ్యక్షతన గ్రామ శాఖ మహాసభ జరిగింది. ఇందులో కొంగరి వెంకట మావో మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న బూర్జువా, భూస్వామ్య లక్షణాలు గల ప్రభుత్వాలు బడా భూస్వాముల కార్పొరేట్ వర్గాల కొమ్ముగాస్తు పేదలను, రైతులను, కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ మోయలేని భారాలు మోపుతున్నారని ఈ విధానం సరైనది కాదని గ్రామంలో నెలకొన్న సమస్యలపై సంఘటితంతో సిపిఎం సభ్యులు కార్యకర్తలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సమస్యలను గుర్తించి సంఘటితంగా పోరాడితే సమస్యలన్నీ పరిష్కరించబడతాయని కడవేర్గు గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలపై సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో అధ్యయనం చేస్తుందని ప్రస్తుతం గ్రామంలోని ప్రజలు రేషన్ కార్డుల కోసం పెన్షన్ల కోసం ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని ఈ సమస్యలతో పాటు గ్రామంలో సిసి రోడ్లు, వీధిలైట్లు, మంచినీటి సమస్య, వీధిలైట్ల సమస్య భూ సమస్య లు పరిష్కారం కాకుండా ఉన్నాయని వీటిపై ఇంకా లోతుగా గ్రామంలో అధ్యయనం నిర్వహించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని సిపిఎం నిర్వహించే పోరాటాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ భాగస్వాములు కావాలని అప్పుడే గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. ఈ గ్రామ శాఖ మహాసభలో శాఖ కార్యదర్శిగా మర్యాల సత్తయ్య తిరిగి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలోపార్టీ జిల్లా కమిటీ సభ్యులు రామ్ సాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, మండల కమిటీ సభ్యులు గొర్రె శ్రీనివాస్, పొనుగోటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సభ్యులు పిట్టల శ్రీనివాస్, బాగోతం బాబు, జల్లి రాములు, మడికొండ కిష్టయ్య, కోడూరు బుచ్చయ్య, భద్రయ్య, పిట్టల యాదయ్య, ప్రశాంత్, పిట్టలచిన్న మల్లయ్య, బాగోతం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
