184 Views
బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ …

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జనవరి 31, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ స్కూల్ బసు, ఆర్టీసీ బస్ కొట్టడంతో 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడం జరిగిందని. ప్రభుత్వం ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు నడపడంతో ప్రమాదాల గుడవుతున్నాయని వచ్చే అసెంబ్లీ బడ్జెట్లో ఆర్టీసీకి ప్రత్యేక నిధులు కేటాయించి నూతన బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు పాటించకుండా ప్రవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయని ఫిట్నెస్ ఇతర మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయని వెంటనే ఆర్టీవో అధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ బస్సుల పైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటనపై విచారణ
జరిపించాలని, ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ మరియు మండల అధ్యక్షులు మట్ట నరేష్ పట్టణ అధ్యక్షులు రుద్రవెని సుజిత్ కుమార్ నాయకులు గణేష్ రాకేష్ మేకల శశాంక్ వాసం శ్రీ సూరజ్ వినయ్ రంగు దినేష్ తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found