బీఆర్ఏస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్
దౌల్తాబాద్: రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రుణమాఫీ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశం, నాయకులు శ్రీనివాస్, కుమార్, ముత్యాల గౌడ్, భాస్కర్, హనుమంతు, రాజు, ముత్యాలు, రాములు, సాయిలు తదితరులు పాల్గొన్నారు…




