ముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ మండలం సేవ్లాల్ తండ మరియు మొర్రాపూర్ గ్రామాలకు రమావత్ రజిత మరియు భూక్య మణెమ్మలు గుడుంబా అమ్మి కేసుల పాలైనప్పటికి తమ వ్యాపారాలను కొనసాగించగ విసుగు చెందిన ఎక్సైజ్ వారు ముస్తాబాద్ అప్పటి తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి ముందు గత సంవత్సరం మార్చి 26 మరియు ఫిబ్రవరి 23 తారీఖు నాడు బైండోవర్ చేశారు. బైండోవర్ ఐ కూడా తమ వ్యాపారాలను కొనసాగింస్తూ , గుడుంబా అమ్ముతూ గత సంవత్సరం ఎప్రిల్ 23 మరియు నవంబర్ 2 తారీఖునాడు ఎక్సైజ్ వారికి దొరకగా కేసులు నమోదు చేసి తహసీల్దార్ కు రిపోర్ట్ సమర్పించగా, బైండోవర్ ఉల్లంఘన క్రింద చెరో లక్ష రూపాయల జరిమాన విదించగా యస్. బి.ఐ. సిరిసిల్ల నందు చలాన రూపకంగ నిన్నటి రోజు జరిమానా చెల్లించినారని ఎక్సైజ్ సి.ఐ.శ్రీ ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ యస్సై శైలజ ,కానిస్టేబుల్స్ సుమన్, శంకర్, హమీద్, రాకేష్, మల్లేశ్ ,కీషోర్ కుమార్ ,దివ్య, భవానీ మరియు లలిత పాల్గొన్నారు. పై కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని సి.ఐ.అభినందించారు.
