ప్రాంతీయం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే మన ఊరు – మన బడి కార్యక్రమం*

122 Views

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ఎల్లారెడ్డిపేట మండలం పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్*

రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 16:: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మన బడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వెంకటాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, బొప్పాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కిషన్ దాస్ పేట, నారాయణపూర్, దుమాల, బండలింగంపెల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, రాజన్నపేట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, మౌళిక సదుపాయాలు, వసతుల కల్పన కోసం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నీటి సౌకర్యంతో టాయిలెట్లు, గ్రీన్ చాక్ బోర్డ్ లు, ప్రహరీ గోడలు, త్రాగునీటి సౌకర్యం, విద్యుదీకరణ, విద్యార్థులకు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్ , పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మరమ్మతులు చేయడం, కిచెన్ షెడ్లు, ప్రహారీ గోడల నిర్మాణం, శిథిలమైన గదుల స్థానంలో కొత్త గదులను ఏర్పాటు చేసుకోవడం, డైనింగ్ హాల్, డిజిటల్ విద్య అమలు అంశాలను పరిగణలోనికి తీసుకుని ప్రతిపాదనలను రూపొందించాలన్నారు. పాఠశాల అభివృద్ధిలో సంబంధిత  ప్రధానోపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీలు చురుకుగా పని చేసి పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈరోజు సందర్శించిన పాఠశాలలో పాటు మండలంలోని బాకురుపల్లి, అల్మాస్ పూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, రాజన్నపేట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. దాతలు, పూర్వ విద్యార్థులు సహకారం అందించే పక్షంలో వారి సహకారాలను తీసుకోవాలని అన్నారు.

*బొప్పాపూర్ గ్రామంలో నర్సరీ, గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనుల పరిశీలన*

బొప్పాపూర్ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంచాయితీ సిబ్బందిని అడిగి నర్సరీ నిర్వహణ తీరును కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ నర్సరీలో 15 వేల మొక్కలను పెంచుతున్నట్లు సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. కలుపు లేకుండా చూడాలని, మొక్కలన్నీ సంరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణం నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

     ఈ సందర్శనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా విద్యాధికారి డా. రాధాకిషన్, డీఆర్డీఓ కె. కౌటిల్య, ఎంపీడీఓ చిరంజీవి, సర్పంచులు, పాఠశాల నిర్వహణ కమిటీల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7