దుబ్బాకః ఆపద వొచ్చింది అంటే తానున్నానని అండగా మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి నిలుస్తున్నారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పై దృష్టి సారిస్తూనే ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతంలో ఎవరికి ఆపద వొచ్చినా వెల్లి భరోసా అందించి అండగా నిలుస్తున్నారు.
దుబ్బాక మండలంలోని ఛీకొడులో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు అంబేద్కర్, రెడ్డి, రజక, విశ్వ బ్రాహ్మణ, మజీద్ కమిటీ కుమ్మరి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాలకు, సీసీ రోడ్డు, డ్రైనేజీ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు.అలాగే గ్రామ పంచాయతీ దుకాణ సముదాయం, రేణుక పశువుల దాణా కేంద్రం లను ఎంపీ ప్రారంభించారు.మండలంలోని వెంకటగిరి తండా గ్రామ సర్పంచ్ పెంటవ్వ బాలకిషన్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని వారిని ఆశీర్వదించారు.
శిలాజీనగర్ లో నూతన గ్రామ పంచాయతీ భవనానికి, సీసీ రోడ్ల పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు.
బల్వంతాపూర్ గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణ మహోత్సవంలో ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుబ్బాక మండలంలోని వెంకటగిరి తండాలో ఇటీవల మరణించిన బానోత్ నారాయణ,శిలాజీనాగర్ లోని టేకుల తండాలో ఇటీవల మరణించిన గోపాల్, గంభీర్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, మాజీ సర్పంచ్ పర్శరాములు గారి తండ్రి శంకర్ గౌడ్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్ధిక సహాయం అందించి నెనున్నానని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు…




