గజ్వేల్ తెలుగు న్యూస్ ఫిబ్రవరి 16 : గజ్వేల్ పట్టణ శివారు బాలికల విద్య సౌధం లో గల తెలంగాణ మోడల్ స్కూల్ ను అకాడమిక్ మానిటరింగ్ సభ్యులు పి.సరోజిని దేవి, జేడీ మోడల్ స్కూల్స్ మరియు ఏ.కవిత, అసిస్టెంట్ డైరెక్టర్ మోడల్ స్కూల్ గారు సందర్శించారు. దీనిలో భాగంగా జేడీ గారు ప్రత్యేక తరగతులు, వెనుకబడిన విద్యార్థుల గురించి మరియు పాటశాల లో నిర్వయిస్తున్న వివిధ కార్యక్రమల గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు. 2021-22 సంవత్సరం లో 100% ఫలితాలు సాధించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్శన లో మానిటరింగ్ సభ్యుల తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
