రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం లో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళిత మహిళ నీరు తాగిందని కర్ణాటకలోని చామరాజ నగరు జిల్లా హెగ్గోతర గ్రామంలోఓ పెళ్లికి వచ్చిన దళిత మహిళ అగ్రవర్ణాలు నివసించే చోట నుండి ట్యాంక్ లోని తాగునీటిని తాగిందని అగ్రహానికి గురైన అక్కడిప్రజలు గోమూత్రంతో ట్యాంకును శుద్ధి చేయడం అనేది సిగ్గుచేటు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలకు దగ్గరవుతున్నా.., మూఢనమ్మకాలు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ కాలంలో కూడా పశువు కంటే హీనంగా మనిషిని చూస్తున్నారు. దేశంలో ఒకవైపు అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతావుంటే కొందరు మాత్రం పనిగట్టుకుని మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తూ.. ఇప్పటికీ మన దేశాన్ని ఇతర దేశాలపై ఆధార పడేవారుగామారుస్తన్నారు. ఇది మనమెంత శ్రమించిన మూఢనమ్మకాలవల్ల తిరోగమనానికి వెళ్లడం తప్ప అభివృద్ధిలో ఏమాత్రం మనం ముందు ఉండడం లేదు మూఢనమ్మకాల ప్రభావం అన్ని రంగాల్లో కనబడుతుంది ఇలాంటి మూఢనమ్మకాలతో సమాజాన్ని బట్టి పీడించే వారిని కఠినంగా శిక్షించాలి. ప్రజలు చైతన్యమయ్యి, ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని దోసల చంద్రం డిమాండ్ చేశారు
