ప్రముఖ ఎన్నారై సామాజిక సేవ కార్యక్రమం నిర్వహిస్తున్న రాధారావు సత్యం వీర్నపల్లి మండల ఆటో యూనియన్ సభ్యులు అడిగిన వెంటనే టీ షర్టులను అందజేశారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేతుల మీదుగా మండల ప్రజా ప్రతినిధుల ద్వారా ఆటో యూనియన్ సభ్యులందరికీ టి షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల్లో పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ రాధారం సత్యం ను అభినందించారు.అడిగిన వెంటనే టీ షర్టులు అందజేసిన ఎన్ఆర్ఐ రాదారం సత్యం కు ఆటో యూనియన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం యాదవ్, భారత రాష్ట సమితి మండల శాఖ అధ్యక్షులు గుజ్జుల రాజు రెడ్డి, బంజారా గిరిజన సంఘం నాయకులు గుగులోత్ సురేష్ నాయక్ , వీర్నపల్లి ఎస్సై డి నవత , మండల ప్రజా ప్రతినిధులు నాయకులు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
