గజ్వేల్ లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి కి యదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు వచ్చేనెల 13 నా నిర్వహించనున్న సందర్భంగ వంగపల్లి అంజయ్య స్వామి ఎమ్మెల్సీ యాదవరెడ్డి కి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి కి, ఆరవ వార్డు కౌన్సిలర్ బబ్బురి రజితకు ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ దైవారాధనతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని వంగపల్లి అంజయ్య స్వామి అధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభనందనీయమన్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు వారి సేవలను గుర్తించి తమిళనాడులోని ఏషియా వేదిక కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు ఇవ్వడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు కొమురవెల్లి శంకరయ్య, యాదగిరిగుట్ట ఆర్యవైశ్య నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, పంతంగి చంద్రశేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు




