Breaking News ప్రాంతీయం రాజకీయం

తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి

195 Views

తరిమేస్తామంటే ఊరుకుంటామా?

– మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం
-ఖబర్దార్ రేవంత్ రెడ్డి
– పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట :

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మీ గంగిరెద్దు వేషాలు సాగనివ్వమని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ ఘాటుగా స్పందిస్తూ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24 గంటలు కరెంటు ఇవ్వడం కనబడడం లేదా? రైతులు ఆర్థికంగా ఎదగాలని రైతుబంధు ప్రవేశపెట్టిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిది కాదా నేతన్నలకు వస్త్ర పరిశ్రమలో సిరిసిల్లకు ఆపరెల్ పార్కు తెచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ ది అని ఇల్లు లేని వ్యక్తికి సొంత ఇంటి కల నెరవేరాలని డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తున్నది మీ కంటికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మి పేరిట ఒక లక్ష 10,116 వేలు ఇస్తున్నది నిజం కాదా? షాది ముబారక్, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు, ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్టు, కాలేశ్వరంలో భాగంగా వేలాది గొలుసు కట్టు చెరువులు నిర్మాణం చేసుకున్నది వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణ రాకముందు సిరిసిల్ల ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా తీర్చిదిద్దారు సిరిసిల్ల అభివృద్ధి అందాలు నిన్న నీకు కనబడలేదా అని ఆయన దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవి నువ్వు కల్వకుంట్ల కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఖబర్దార్ అని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *