ప్రాంతీయం

విద్యార్థులకు హిందీ టాలెంట్ టెస్ట్

151 Views

దౌల్తాబాద్: దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం హిందీ ప్రచారమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ టెస్టులో పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. వీరు ఫిబ్రవరి 8న సిద్దిపేటలో జరిగే జిల్లాస్థాయి హిందీ టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నాకర్‌రెడ్డి, విజయకృష్ణ, రజని తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *