రాయపోల్ మండల కేంద్రంలోని మండలం మహిళా సమైక్య కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో మున్నయ్య, ఎంపీఓ లక్ష్మీనారాయణ, సిద్దిపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా సమైక్య ఈసీ నెంబర్ హాజరై కంటి వెలుగు కార్యక్రమం 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం మొదటిసారిగా మండల మహిళా సమాఖ్య వివో ఎలా సమావేశానికి హాజరైన ఎంపీడీవో, ఎంపీఓ, జిల్లా సమైక్య అధ్యక్షురాలకు శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం దుర్గాప్రసాద్, సీసీలు కిష్టయ్య, రవీందర్, నాగరాజు, ప్రవీణ్, రోజా, వివో ఏలు పాల్గొన్నారు.
