అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారం మరువలేమని గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి గుప్త అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గం బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా+మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ నిధులకు కొరత లేకుండా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పరచడంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని మున్సిపాలిటీ పరిధిలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని ముఖ్యంగా ఎడ్యుకేషన్ సమీకృత కార్యాలయ భవనం సమీకృత మార్కెట్ యార్డ్ మహతి ఆడిటోరియం. మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం తోపాటు ప్రత్యేకంగా చెత్త సేకరణ డంపింగ్ యార్డ్ పట్టణ సుందరీకరణ కోసం విద్యుత్ దీపాలంకరణ లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్- ప్రజ్ఞాపూర్ నెంబర్ వన్ గా నిలిచిందని, టిఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశాన్ని ఆదర్శంగా ఉండగా బిఆర్ఎస్ పార్టీతో దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరిగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో అడుగు పెట్టారని అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.