ప్రాంతీయం

ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి

126 Views

దౌల్తాబాద్: గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి స్నేహ పూర్వకంగా ఉండాలని ఆర్ ఐ మధుసూదన్, ఏఎస్ఐ సాయిలు లు అన్నారు. శనివారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరినైనా అంటరానివాదిగా చూడరాదని, హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి విధానాన్ని పాటించవద్దన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్య జఠిలంగా ఉంటే రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ సింహాచలం, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *