రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్లన వరి లో కాండం తొలిచే పురుగు యొక్క ప్రభావం లో అధికం గా ఉన్నది అని వర్గల్ వ్యవసాయ అధికారిని శేష శయన అన్నారు.
వర్గల్ మండలంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఎకరాల వరకు వరిసాగు తెలిపారు . యాసంగి లో 6500ఎకరాలు వరకు వరి వేయవచ్చని అంచనా . మండలం లోని పలు గ్రామాలలో పంట పొలాలలను సందర్శించారు.
కాండం తొలిచే పురుగు వరి పైరును అన్ని దశల్లో ఆశిస్తుంది. అయితే దీని దాడి ప్రభావం ప్రస్తుతం నాట్లు వేస్తున్న సందర్భం లో కూడా ఎక్కువ గ ఉంటుంది .దుబ్బు దశలో ఇది మొక్క మధ్య కాండాన్ని తినివేయటం వలన మొవ్వు చచ్చి పొయి ఎండిపోతుంది. ఆ స్థితిని బట్టి దీన్ని మొగ (మొవ్వు) పురుగ్గా తెలిపారు.
యాసంగి లో కాండం తొలిచే పురుగం – యూజమాన్యం
• నారు నాటడానికి వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రా. ల కార్బోప్యూరాన్ 3జీ గుళకలు లేదా 600 గ్రా. ల ఫిప్రోనిల్ 0.3 జి గుళికలు వేయాలి.
నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టనట్లయితే నాటిన 15 రోజులకు ఎకరాకు కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు
లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0. 4 జి గుళికలు 4 కిలోలు వేయాలి.
నాట్లు వేసే సమయం లో నారు కోనలు తుంచి నాటుకోవడం ద్వారా పురుగు యొక్క ఉధృతి తగ్గించవచ్చని ఆమె తెలిపారు .
పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎరను, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను నాటిన పాలంలో అమర్చుకోవాలి.
పిలకదశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు. తప్పనిసరిగా సస్యరక్షణ చేపట్టాలి.
• నాటిన పంటలో పురుగు ఆశించిన లక్షణాలు గమనిస్తే క్వినాల్ ఫాస్ 2 మి. లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి. లీ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా. లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేదా నాటిన 10 నుంచి 15 రోజుల మధ్యలో క్లోరామ్టానిలిప్రోల్ 0.4 గుళికలు నాలుగు కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 4 కిలోలు లేదా ఫ్లూబెండమైడ్ గుళికలు 5 కిలోలు ఇసుకలో కలిపి తప్పనిసరిగా వేసుకోవాలి అని సూచన చేసారు.