శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం, చర్మ-ఆరోగ్యం.. వంటి ప్రయోజనాలను చేకూర్చే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్‌ను సలాడ్‌గా మాత్రమేకాకుండా ఈ కింది ప్రత్యేక రుచుల్లో కూడా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం..




