
జగదేవపూర్: మండలం లోని అంతయగూడెం గ్రామంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శ్రీ ముజామిల్ ఖాన్ స్థానిక సర్పంచ్ సత్యం. సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ తో కలిసి పరిశీలించారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ ను సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్ శాలువతో ఘనంగా సత్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కంటి వెలుగును పగడ్బంధీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల యువజన అధ్యక్షుడు సురేష్,ఉప సర్పంచ్ కార్యదర్శి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




