24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మార్కుక్ జూన్ 11.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రోహిణి కార్తీ తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు
ఇప్పటికే ఎరువులు విత్తనాలు కొనుగోలు లో బిజీ బిజీగా ఉన్నారు రైతులు కొనుగోలు చేయగా మరి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా బీటీ పత్తి విత్తనాలను కొనుగోలుకి రైతులు అసక్తి చూపుతున్నారు దీంతోపాటు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు వానకాలం సంబంధించి జిల్లాలో వ్యవసాయఅధికారులు ప్రణాళికను సిద్ధం చేసి అంచనా వేశారు రైతులు పంటను ఎంత విస్తరణలో సాగు చేస్తారో అంచనా వేసి అందుబాటులో తీసుకొచ్చారు రోహిణి లో విత్తనాలు వేస్తే పంటలకు ఎలాంటి చీడపీడలు రాకుండా పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతుల నమ్మకం వరి పత్తి మొక్కజొన్న జొన్న కందులు పెసర పంటలకు సంబంధించిన విత్తనాలు ఎంత మేరకు అవసరము అంచనా వేసుకుని జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎరువులు మాత్రం దశాల వారుగా తెప్పించనున్నారు గజ్వేల్ కేంద్రంగా ఎరువుల రేక్ పాయింట్ ఉండగా సకాలంలో ఎరువులను జిల్లాలోని ప్రధాన పంటలకు సరఫరా చేసుకునే వీలుంటుంది వానకాలం జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 50 ఎకరాల వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయునట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
