రైతుల ప్రత్యేక వేషధారణతో విద్యార్థులు
– కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల రైతు పనిపై అవగాహన
ప్రజాపక్షం,/ ఎల్లారెడ్డిపేట:
విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ ధరించి శివారులో ఉన్న పొలాల వద్దకు తీసుకువెళ్లి ప్రాక్టికల్ గా చూపించడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు రజిత పేర్కొన్నారు. ఈ వేషధారణలో సుమారు 13 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
