Breaking News ప్రకటనలు రాజకీయం

బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!!

449 Views

బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!

సెస్ డైరెక్టర్ పదవి , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అయన చేసిన ప్రయత్నాలు విఫలం
ఎల్లారెడ్డిపేట జూలై 21 :
బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కి మళ్లీ మెండిచెయ్యే మిగిలింది
బండారి బాల్ రెడ్డి సెస్ డైరెక్టర్ పదవీ కి పోటీ చేయడానికి బిఆర్ ఎస్ పార్టీ తరపున సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆశీస్సులతో వరుస కృష్ణ హారి కి అట్టి అవకాశం దక్కింది దీంతో బాల్ రెడ్డి ఆశలు ఆడి ఆశలయ్యాయి, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నైనా ఇప్పించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు మొరపెట్టుకున్నారు, దీంతో కెటిఆర్ కూడా సరైన అవకాశాలు ఇప్పీస్తానని ఇచ్చిన హమీతో ఆయన పడ్డ ఆశలు ఆడి ఆశలయ్యాయి,
బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాజీ ఎంపీపి ఎలుసాని మోహాన్ కుమార్ యాదవ్ కు బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ద్వారా అవకాశం లభించింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, పని చేసిన ఆయన కొన్ని కారణాలతో బిఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరారు , రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం . కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి హోదాలో బండారి బాల్ రెడ్డి, మండలంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల అఖిలపక్ష అధ్యక్షులు గా సమర్థవంతంగా పని చేసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రకటించేవరకు పని చేశారు, పదవులు దక్కకపోవడంతో బాల్ రెడ్డి నిరాశతో ఉన్నారు ఎప్పటికైనా ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నట్టు మీడియాతో మాట్లాడారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *