మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు సూరంపల్లి అశోక్ అంత్యక్రియల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మ హత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలతో విలువైన ప్రాణాలను కోల్పోవధ్ధన్నారు. కెసిఆర్ పాలనలో రైతుల పరిస్థితి దీనంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రైతులు అధైర్య పడోద్దని, ప్రభుత్వం రాగానే ఏక కాలంలో రుణ మాఫీ చేస్తామన్నారు. అలాగే అప్పుల బాధతో ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25లక్షల నష్ట పరిహారం చెల్లించాలన్నారు. నాయకులు రామస్వామి, వినోద్, నర్సింలు, బాబు, ప్రశాంత్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
