గజ్వేల్ పట్టణంలోని పిఎన్ఆర్ గార్డెన్లో జరిగే రెడ్డి సంఘం ఆత్మీయ సభను విజయవంతం చేయాలని రాయపోల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, అంకిరెడ్డిపల్లి స్థానిక సర్పంచ్ వెంకట నర్సింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రెడ్డి కుటుంబాలు ఆర్థికంగా ఎదగలంటే ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు ఏకమై ఐక్యమత్యంతో పోరాడితేనే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదుగుతారని, కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టే పథకాలు, ఉద్యోగాలు ఇతర సబ్సిడి రుణాలు పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇందుకోసం వివిధ జిల్లాల ప్రతి రెడ్డి సంఘం సోదరులు అందరూ హజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
