రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయాన్ని నిధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్క కనకరాజుకు 60,000/- వేల రూపాయలు, బోటుక అంజయ్య 60,000/- వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్, వార్డ్ మెంబర్ నరసింహులు, బాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, లచ్చయ్య, కిష్టయ్య, శివంది నరసింహులు, కరుణాకర్ , నవీన్, రమేష్, మల్లయ్య, సత్తయ్య, నీరుడి నర్సింలు, మహేందర్, అంజయ్య, సాయిలు, మధు, రవి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.




