ప్రాంతీయం

*జిల్లా ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి*.

115 Views

ఎడ తెరప లేకుండా వర్షాలు కురుస్తునందున్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు.

1) వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
2) ఇనుప వైర్ లపై గృహిణి లు బట్టలు ఆరవేయరాదు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.
3) ఇంటి పై కప్పుగా వేసిన ఇనుప రేకులను తాకరాదు.
4) శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ,మట్టీ గోడలు తో ఉన్న ఇళ్ళలో నివాసం ఉండకండి,అవి ఊహించని విధంగా కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
5) రైతులు మీ వ్యవసాయ బావుల వద్ద ,బోర్ ల వద్ద కరెంట్ పెట్టె ముందు తడిసిన స్టార్టర్ బాక్స్ లను,ఫ్యుజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోరాదు.
6) వరద నీటికి చెరువులు,కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది.కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.
7) చిన్నపిల్లలు మరియు ఈత రానివారు ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువు లోకి ఈత కు గాని లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. తల్లిదండ్రులు పిల్లలను బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
8) వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి , అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.
9) వరదల వలన డ్రైనేజి కాలువల మ్యాన్ హోల్స్ వాటికవే తెరువబడి ఉంటాయి కావున జాగ్రత్త గా ప్రయాణించగలరు.
10) వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నపౌడు వాహనాలతో దాటడానికి సాహసం చేయకండి.
ప్రజలందరూ ఈ వర్షా కాలం లో జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ విష వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా మరియు ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాము.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7