ప్రాంతీయం

లష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

213 Views

లష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామ దేవతలైన గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ పండుగలను వచ్చే నెల 8,9,10 వ తేదీన నిర్వహించనున్నట్లు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆవరణలో అన్ని కుల సంఘాల తో మైసమ్మ,దుర్గమ్మ దేవతల పునఃప్రతిష్టపన కార్యక్రమంలో బాగంగా సన్నాహక సమావేశంజరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని కుల సంఘాల వారు ఇంటికో బోనం చొప్పున తీయాలని అన్నారు.తానే అన్ని ఖర్చులు స్వయంగా భరించుకుంటానని అన్నారు.గ్రామంలో మొదటగా పోచమ్మకు బోనాలు తీయాలని నిర్ణయించారు.బోనాలకు సంబంధించిన కుండలను కూడా తన స్వంత డబ్బులతో తెప్పించి అన్ని కుల సంఘాల వారికి అందిస్తానని అన్నారు.లష్కర్ బోనాల తరహాలో పోతరాజు లను హైదరాబాద్ నుండి తెప్పిస్తానని అన్నారు.అదే విదంగా మార్చ్ నెలలో ప్రతి కుటుంబాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంలు తిరుపతి మొదలుకొని మొత్తం 11 పుణ్యక్షేత్రంలు తన స్వంత ఖర్చులతో తీసుకువెలుతానని ఆయన అన్నారు.ఫిబ్రవరి నెలలో పుణ్యక్షేత్రంలకు వచ్చేవారు వారివారి కులసంఘాల అధ్యక్షులకు ఆధార్ కార్డులను అందించాలని కోరారు.గ్రామంలో గల ప్రతి గ్రామ దేవతకు గొర్రె పొట్టేళ్లను లేదా మేకపోతులను కానీ బలి ఇచ్చే వాటిని కూడా తానే స్వంత ఖర్చులతో తెప్పిస్తానని అన్నారు.గ్రామస్తులు సహపంక్తి భోజనాలు చేయాలని సర్పంచ్ వెంకట్ రెడ్డి గ్రామస్థులను కోరారు.ఈ సమావేశంనకు ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న సర్పంచ్ వెంకట్ రెడ్డి కి అందరూ సహకరించాలనికోరారు.ఈ సందర్భంగా ఇట్టి నిర్ణయం తీసుకున్నందుకు వెంకట్ రెడ్డి ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు నంది కిషన్,మేగి నర్సయ్య బిఆర్ఎస్ నాయకులు ఎనగందుల నర్సిములు, పర్శరాములు గౌడ్, గ్రామపాలకవర్గ సభ్యులు,సింగిల్ విండో చైర్మన్ కృష్ణా రెడ్డి,మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజ్ యాదవ్,బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి,మహిళ సంఘాల సభ్యులు,మహిళ సంఘాల సభ్యులతో పాటు 28 కులసంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్