ప్రాంతీయం

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి…

114 Views

ముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీస్టడీ సర్కిల్ జెల్లా వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పేద విద్యార్థులు ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఫూలే జీవితాంతం పోరాడారని తెలిపారు. ఫూలే కలలు కన్న రాజ్యం రావాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ గెంత్యాల శ్రీనివాస్, హరీష్ , సురేష్, కిరణ్మయి, స్టడీ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్