సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో చేపట్టిన మోడల్ లే ఔట్ లోని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో మోడల్ లే ఔట్ పనుల పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ లే ఔట్ లో బీటీ రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయం, ప్లాంటేషన్, తదితర పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అన్నారు. ప్లాట్లను వేలంపాట వేయడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో నెలకొన్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని ఆర్డీఓ ను ఆదేశించారు. వారం రోజుల్లోగా మోడల్ లే ఔట్ సిద్ధం చేయాలని సూచించారు.
