వేములవాడ – జ్యోతి న్యూస్
-
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని ఈవో కార్యాలయం ముందు ఓ భక్తుడు ఫిట్స్ తో బాధపడుతూ మృతి చెందాడు.
ఇంతకుముందే మీడియా మిత్రులు ఆలయ అధికారులతో చర్చించడం జరిగింది అయినా అధికారులు స్పందించడంలేదు ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి వైద్య సిబ్బంది 24 గంటలు ఉండేలా చూడాలని మీడియా మిత్రులు కోరుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే..కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు (70) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో సోమవారం ఉదయం రాజన్నను దర్శనానికి వచ్చారు. రాజన్న ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం ఈవో కార్యాలయం ముందు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దేవాలయ ప్రాంగణంలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు.108 సిబ్బందికి ఫోన్ చేసినా సకాలంలో అంబులెన్స్ రాలేదని భక్తుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆలయ అధికారులు సైతం వైద్య చికిత్స అందించే ప్రయత్నం చేయలేదని, అధికారులు పట్టించుకోకపోవడంతో వైద్యం అందక మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని కారులో వారి స్వగృహానికి తీసుకువెళ్లిన పరిస్థితిని చూసి అక్కడున్న భక్తులు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.