- జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్….
సోమవారం మధ్యాహ్నం గజ్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని చాకలి ఐలమ్మ కమ్యునిటీ హల్ నందు,
వర్గల్ మండలం అంబర్ పేట గ్రామం లోని గ్రామ పంచాయతీ భవనం లో, ములుగు మండలం ములుగు గ్రామ పంచాయతీ భవనం లో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
గజ్వేల్ మునిసిపల్ చైర్మన్ రాజమౌళి కలెక్టర్ కి స్వాగతం పలికారు. నిర్వహణ లో సెంటర్ పనిచేసే అప్తామెట్రిక్ డాక్టర్, డాటా ఎంట్రి ఆపరేటర్, సుపర్ వైజర్, ఎఎన్ ఎమ్, ఆశా ఇతరత్రా సిబ్బందితో మాట్లాడారు. ఏర్పాట్లలో తగు సూచనలు చేశారు. మునిసిపల్ కమిషనర్ విద్వాదర్ కి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చెయ్యాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చెయడంలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. కౌన్సిలర్లు వార్డులో కంటి వెలుగు గుర్చి ప్రజలకు వివరించి వారిని సెంటర్ కి రప్పించెలా చర్యలు తీసుకోవాలి.
వర్గల్ మండలం అంబర్ పేట గ్రామం గ్రామపంచాయతీలో మరియు ములుగు గ్రామ పంచాయతీ లో నిర్వహణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. టాబ్ లో సభ్యుల నమోదు వివరాలను పరిశీలించారు. అన్ని వసతులు కల్పిస్తున్నాం ఎలాంటి సమస్య అయిన వెంటనే డిఎంఎచ్ఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. ఆయా గ్రామాల్లో సిబ్బందికి భోజనానికి సంబందించి ఏర్పాట్లు ఎంపిడిఒ స్థానిక పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలి. సిబ్బంది రోజు 8:30వరకు సెంటర్ కి చేరుకోవాలి. ఇంత గోప్ప కార్యక్రమం లో విజయవంతం గా పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపలాని ఆదేశించారు.కలెక్టర్ వెంట డిఎంఎచ్ ఒ కాశీనాథ్, గజ్వేల్ డివిజన్ డిప్యూటీ డిఎంఎచ్ ఓ విజయరాణి, ఎంపిడిఒ లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
