తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నిన్నటి రోజున తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చిన సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనందున వారి తల్లి దహన సంస్కారాలకు కూడా చిల్లీ గవ్వ చేతిలో లేనందున దాతలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ సోదరుల, గ్రామస్తుల సహాయ సహకారాలతో అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది.ఈరోజు ఆ అన్నచెల్లెల పరిస్థితి చూసి తినడానికి *50 కేజీల బియ్యం, నిత్యవసర సరకుల కొనుగోలు నిమిత్తం 1000 రూపాయలు నగదు* అందించడం జరిగింది. మీకు ఏ అవసరమొచ్చిన అండగా మేముంటామని మీరు అధైర్యపడవద్దని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగల రాజు, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామా గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్, వార్డు సభ్యులు రెడ్డి పరుశురాములు ,క్యారం జగత్ కుమార్, మండల బిఆర్ఎస్ యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేరెళ్ల అనిల్ గౌడ్, గంగ అజయ్ రెడ్డి, తోకల మహేష్ తదితరులు పాల్గొన్నారు
