– దుబ్బాక స్ఫూర్తి గా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం
– యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు పంపిణీ చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
దౌల్తాబాద్; యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని, వారి అండదండలతో వొచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. తొగుటలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 1070 మంది యువకులకు డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ లు పంపిణీ చేశారు.. ఈసందర్భంగా ఆయన యువకులకు డ్రైవింగ్ పాఠాలు నేర్పారు..డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించడానికి ఇబ్బందులు అవుతాయని, ఈసందర్భంగా పలు ఉదాహరణలు వివరించారు. హెల్మెట్ లేకుంటే ఎంతోమంది ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు.. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలన్నారు..తెలంగాణ ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీఠ వేయడం జరుగుతుందన్నారు..నార్మల్ ప్రసవాలు పెరిగాయన్నారు.. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, అందించడం జరుగుతుందన్నారు..ఉప ఎన్నికల్లో యువతకు మాయమాటలు చెప్పి రఘునందన్ మోసం చేశారని, రబ్బరు చెప్పులు, జీన్ ప్యాంట్లు వొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జై కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు…..తెలంగాణ రాక ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నేడు ఏవిదంగా దేశంలోనే ఆదర్శంగా నిలిచిన పరిస్థితి ని గ్రామ స్థాయిలో వివరించాలన్నారు..నాటి కరువు కటకాలతో ఉన్న దుర్భిక్ష పరిస్థితి, నేడు సాగునీటి వనరుల అభివృద్ధి తో ఆకుపచ్చ గా మారిన వైనాన్ని వివరించాలన్నారు.. తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్నారు..మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రుణమాఫీ, కూడవెల్లి జీవనదిగా మారిన వైనం, మల్లన్న సాగర్ జలాలు చెరువు కుంటల్లోకి ప్రవహిస్తున్న వైనాన్ని వివరించాలన్నారు….తొగుట ను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భోంపల్లి మనోహరరావు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సిరినేని గోవర్ధన్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, వైస్ ఛైర్మన్ లు కంది రాంరెడ్డి, కుర్మ యాదగిరి, కో అప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, సర్పంచ్ లు తోయేటి ఎల్లం, బొడ్డు నర్సింలు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కుంభాల శ్రీనివాస్, చిలువేరి రాంరెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు




