24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 29)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రనికి చెందిన కీ”శే”అన్నల్ దాస్ సురేష్ మమత కూతురు పూజ వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని,సంపాదనలో కొంత నిరుపేదలకు సహాయం అందిస్తే సంతోషంగా ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఒక నిరుపేద యువతి వివాహానికి నా వంతు సహాయంగా పుస్తే మట్టెలు అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగడం జరుగుతుందనిఅన్నారు ఈ కార్యక్రమంలో మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ ముదిరాజ్,సతీష్ గౌడ్,ప్రవీణ్, భాస్కర్, క్రాంతి,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
