ముస్తాబాద్ జనవరి14, మండలం గూడెం గ్రామానికి చెందిన మందాడి ఆశయ్య వయసు 55 సం,లు ఉదయం మేకల కోసం మేడిచెట్టు ఎక్కి ఆకుకొమ్ములు కొట్టే క్రమం ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా సిద్దిపేట మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడు కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు ఒక కూతురు సంతానం ఉన్నారు మేకల కాపరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యాదవ సంఘం సభ్యులు కోరారు.
