ప్రాంతీయం

ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ…

227 Views

ముస్తాబాద్ జనవరి 14, (ప్రభన్యూస్) మండల ఆంధ్రప్రభ క్యాలెండర్‌ను ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఈరోజు సాయంకాలం (143) (తెలంగాణ అల్లం నారాయణ సంస్థ) ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆంధ్రప్రభ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి హితోధికంగా సహకరిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ.. సమగ్రంగా వార్తలను ప్రజలకు చేరవేస్తోందని ఎస్సై తెలిపారు. అసలైన, నిఖార్సయిన వార్తలతో సుదీర్ఘకాలం రాణించడం అద్భుతమన్నారు. కొవిడ్, లాక్ డౌన్ సమయలోనూ కీలకంగా విధులు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనదైన పంథాను కొనసాగిస్తూ ప్రజల్లో చిరకాలంగా నిలిచి పోయిందన్నారు. ఆంధ్రప్రభ తెలుగు పత్రికగా ప్రజల గుండెల్లో నిలిచి, తెలంగాణ సాధన కోసం, ఆ తరువాత ప్రజల వెంట ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు లక్ష్మీనారాయణ, సుంచు బాబు, ఎస్, ఎస్, సి, రమేష్, రుద్రోజి శ్రీనివాస్, సోషల్ మీడియా సోషల్ మీడియా పరిధి పేట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7