ప్రాంతీయం

విద్యాదినోత్సవ వేడుకలలో విద్యాకమిటీ చైర్మన్ కు ఘనంగా సన్మానం చేసిన ఎంపీపీ…

185 Views
   ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని మండలంలోని మద్దికుంట గ్రామంలో విద్య” దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనుంచి విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మలో, పరిమాణాత్ముక మార్పులను అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ పాఠశాలలో పతాకం ఎగరవేసి వందనం చేశారు. విద్యాకమిటీ చైర్మన్గా సేవలందిస్తున్న పవన్ కు ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల పాత్రికేయ మిత్రులుగా ఇటు చైర్మన్గా సేవలందిస్తూ పవన్  మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనఊరు మనబడి” కార్యక్రమంతో పాటు ఒక వేయికి పైచిలుకు గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు (ఆర్టికల్చర్ ఫారెస్ట్ మహిళా హెల్త్ యూనివర్సిటీ తదితర) జిల్లాకి ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల రెసిడెన్షియల్  సహా తదితర వివరాలను వెల్లడించారు. ఈకార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మాజీ సర్పంచ్ అనిల్ ,ఏఎంసి డైరెక్టర్ గంభీరావుపేట బాలయ్య, ప్రజాప్రతినిధులు ఆశా వర్కర్ లు గ్రామస్తులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *