ప్రాంతీయం

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

123 Views

-పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్:పట్టణ సి.ఐ రఘుపతి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే సిరిసిల్ల పట్టణ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని పట్టణ సి.ఐ తెలిపారు.

ఈ సందర్భంగా సి.ఐ రఘుపతి మాట్లాడుతూ…
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ,పారదర్శక, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ధైర్యాన్ని కల్పించడానికి సిరిసిల్ల పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సుభాష్ నగర్, నెహ్రు నగర్, గోపాల్ నగర్, బి.వై నగర్, సుందరయ్య నగర్, వెంకంపెట్, నేతన్న చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కేంద్ర బలగాలు మరియు జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ లు పట్టణ పరిధిలో అన్ని ప్రాంతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ ఫ్లాగ్ మార్చ్ లో పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7