రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు (1968-69) జూకంటి నరేందర్ రెడ్డి, (Jain international school HOD) చుంచనకోట నర్సింలు, పట్లూరి అంజయ్య గుప్తా కలిసి అదే గ్రామానికి చెందిన పాఠశాలకు క్రీడా పరికరాలను అందజేశారు. కొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న పిల్లలకు క్రీడా పరికరాలను వారు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందిస్తామని వారు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహిస్తామని వారు తెలిపారు. క్రీడా పరికరాలను అందజేసినందుకుగాను పాఠశాల తరఫున,విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
