దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
దౌల్తాబాద్: కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో బిజెపి జెండాను ఆవిష్కరించి, ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం యువతకు డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశం గొప్పతనాన్ని చాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను పెంచడం కాదని, యువతకు ఉపాధి కల్పించాలన్నారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్ నాయకులు దుర్గా రెడ్డి, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, రంజిత్ గౌడ్, నరసింహారెడ్డి, చందు, నరేందర్ రెడ్డి, భాస్కర్, ఎల్లం, దినేష్ రెడ్డి, బిక్షపతి, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు….