భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమం
సిద్దిపేట్ జిల్లా జనవరి 22
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి,ఆదేశానుసారం కుకునూరుపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఏలేశ్వరం నాగరాజు, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015న తొలిసారి రాజ్యాంగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది.
ప్రధాని మోదీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, గౌరవార్థం పంచతీర్థలు అభివృద్ధిలో పటు పేదలు, అణగారిన వర్గాల,సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా అనేక కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి.
రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ్యాంగ వర్తమానానికి, భవిష్యత్ కు మార్గదర్శి నేడు ప్రతి పౌరుడి ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మిచడమే అని అన్నారు, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రామ్ నాథ్ కోవింద్ ని, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది మురము, రాష్ట్రపతి చేసి దేశ అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత బిజెపి నరేంద్ర మోదీ దని అన్నారు, ఎస్సీ ఎస్టీ బస్తీలలో కళాశాలలో, హాస్టల్, సందర్శనలు చేయాలని సూచించారు. బి.ఆర్ అంబేద్కర్ పట్ల బిజెపి నిబద్ధతను యువతకు తెలియజేయాలని అన్నారు,
కాంగ్రెస్ పార్టీ ఐదు తరాల నుండి భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని నెహ్రూ కూడా వ్యక్తిగతంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందున, 1952 మరియు 1954 ఎన్నికలలో ఆయన ఓటమిని నిర్ధారించుకోవడానికి కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకుని, ఎన్నికలలో అంబేద్కర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ చురుకుగా పని చేసిందన్నారు.
నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రిగా, అంబేద్కర్ తన నైపుణ్యాన్ని పక్కన పెట్టి రక్షణ విదేశీ వ్యవహారాలపై కీలక కమిటీల నుండి మినహించబడ్డారు అని అన్నారు,
విభజన అనంతరం దళిత శరణార్థులకు పునరావాసం కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది, కష్టాలను పరిష్కరించాలని అంబేద్కర్ చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు,
మహిళల సాధికారతను లక్ష్యంగా చేసుకున్న అంబేద్కర్ యొక్క హిందూ కోడ్ బిల్లును ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలమైంది, ఇది ఆయన మంత్రివర్గం నుండి రాజీనామాకు దారితీసింది,కాంగ్రెస్ ప్రభుత్వాలు అంబేద్కర్ చేసిన కృషిని విస్మరించాయి మరియు 1990లో కాంగ్రెసేతర ప్రభుత్వంలో మాత్రమే ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది,కాంగ్రెస్ (యూ పి ఏ )ప్రభుత్వ హయాంలో, ( ఎన్ సి ఈ ఆర్ టి ) పాఠ్య పుస్తకంలో అంబేద్కర్ వారసత్వాన్ని అపహాస్యం చేస్తూ అవమానకరమైన కార్టూన్‌ను చేర్చారు,42వ సవరణ వంటి సవరణల ద్వారా ఎమర్జెన్సీ, ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం మరియు కార్యనిర్వాహక వ్యవస్థలో కేంద్రీకృత అధికారాన్ని బలహీనపరిచ్చింద్దాన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి కాంగ్రెస్ 88 సార్లు ఆర్టికల్ 356 ను ఉపయోగించింది, రాజ్యాంగం యొక్క సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసింది,
అంబేద్కర్ హెచ్చరికలను విస్మరించి, కాంగ్రెస్ ఆర్టికల్ 370ని అమలు చేసింది, దానిని అంబేద్కర్ వ్యతిరేకించాడు, జమ్మూ కాశ్మీర్‌లో అసమానతలను అనుమతించారు.
మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కాంగ్రెస్ జాప్యం చేసింది మరియు సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తూ ( ఓబీసీ ) ( ఎస్సీ ) రిజర్వేషన్ల కోసం అర్ధవంతమైన చర్యలను వ్యతిరేకించిందాన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గౌరారం కృష్ణ , మండల ప్రధాన కార్యదర్శిలు పాపగౌని సదానంద గౌడ్, రెడ్డమైన నాగరాజ్, దాసరి స్వామి, ఉపాధ్యక్షులు బోనాల రాజు, కూరేల్ల నాగేందర్ రెడ్డి, గట్టు అనిల్ వివిధ మోర్చా అధ్యక్షులు గుర్రాల స్వామి,తుడుం నాగజ్యోతి డాకురు స్వామి, మండల నాయకులు, కార్యకర్తలు,బుతు అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.





