ముస్తాబాద్, సెప్టెంబర్25, గూడెం గ్రామంలోనీ ఓంశివశంకర యూత్ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్ష్మిగణపతి మండపంలో సోమవారం సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్ర మాలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హా
రతులతో పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఓంశివశంకర యూత్ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో స్వామివారి కృపకు పాత్రులయ్యారు.




