ప్రాంతీయం

డిటిఎఫ్ నూతన అధ్యక్షుడిగా…

534 Views
       ముస్తాబాద్ జనవరి 11, నూతన DTF Democratic Teachers Federation ముస్తాబాద్ మండల శాఖను, మండల కౌన్సిల్ సమావేశంలో దొంతుల శ్రీహరి అధ్యక్షులు DTF రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండలశాఖ నూతన అధ్యక్షుడిగా ఆడెపు గణేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల ప్రభాకర్ , సామ అనిత, దస్తారి శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా అంకూరి శంకర్, కార్యదర్శులుగా అనమేని రామమనోహర్ రావు, నాయిని భాస్కర్ రెడ్డి, సులువ ఉమాకుమారి, మల్లారెడ్డి, District councellor లుగా ఈసరి రవీందర్, మూడపల్లి లక్ష్మణ్, గడ్డం లక్ష్మారెడ్డి, బాదవేని అంజయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా డి.రవీందర్ సభ్యులుగా హసీనాబేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఎన్నికయిన బాధ్యులకు అధ్యక్షులు దొంతుల శ్రీహరి అభినందనలు తెలుపుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపట్ల డీ.టి.ఎఫ్. అకుంఠిత దీక్షతో పోరాటాలు చేస్తూ సామాన్య ఉపాధ్యాయుల పక్షాన నిలబడి అనేక సమస్యల్ని పరిష్కరించారు. ఏ పాఠశాల లో డి.టిఎఫ్. బాధ్యులు/సభ్యులు పనిచేస్తారో ఆ పాఠశాల చక్కగా పనిచేస్తుంది అని ధీమావ్యక్తం చేశారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్