ప్రాంతీయం

తిరుమలాపూర్ గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించిన – దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ – ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండార్ దేవేందర్

130 Views

తిరుమలాపూర్ గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నిధులతో 5 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, బీసీ కాలనీలో 4 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఆ నిధులతో సిసి రోడ్డు, ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు 1.20 నిధులను ప్రారంభించిన దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ లో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పల్లెలు పట్టణాలుగా ఉండాలని దేశంతో ప్రతి గ్రామపంచాయతీకి నిధులు మంజూరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు సీఎం దృష్టికి తీసుకువెళ్ళగా ఈ నిధులు మంజూరు అయ్యాయని వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగిందని నిధులు మంజూరు చేసిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతంగం కోసం రైతుబంధు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ప్రతి ఒక్కరి అకౌంట్లో 5,000/- రూపాయలు చొప్పున ఇప్పటికే పడ్డాయని రైతులు సంతోషిస్తున్నారని వారు అన్నారు. కోసం మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ ద్వారా రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్స్, రైతు బీమా, సీఎం కేసీఆర్ కి దక్కిందని దేశంలో ఎక్కడ లేని పథకాలను ఈ పథకాలను దేశంలో అమలు చేయడం కోసం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నీ సీఎం కేసీఆర్ స్థాపించారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, గ్రామ సర్పంచ్ గడ్డమీద భాగ్య ఎల్లం, ఎంపిటిసిల పోరం మండల అధ్యక్షుడు బండారు దేవేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకండి శ్రీనివాస్ గుప్తా, సీనియర్ నాయకులు రాయపోల్ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, ఏఎంసీ డైరెక్టర్ సత్యనారాయణ, నాగరాజు, మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్ బండారు రాజయ్య, మాజీ ఎంపిటిసి పడాల రాములు, స్కూల్ చైర్మన్లు మల్లేశం, నాగరాజు వార్డ్ సభ్యులు బొప్ప లక్ష్మి, నర్సింలు, నాయకులు కన్నా రెడ్డి, బోటుక సత్తయ్య, ఉప్పరపల్లి రాజు, స్వామి, నర్సింలు, నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, సాయిలు, సత్తయ్య, పటాన్ మస్తాన్, లక్ష్మీ నరసయ్య, రమేష్, మల్లయ్య, నాగయ్య, సపాయి కార్మికుడు అంజి, కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka