ప్రాంతీయం

సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు బెడ్లు బ్యాగులు బెల్టులు పంపిణీ చేశారు…

299 Views

ముస్తాబాద్ జనవరి 11, మండల పరిధిలోవున్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో (బాలురు) విద్యార్థులకు బెడ్లు స్కూల్ బ్యాగులు, బెల్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద మధ్య తరగతులకు గురుకులాలు అండగా వుండి ,మంచి విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థి పై లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. ప్రైవేటు కు దీటుగా గురుకులాలు పటిష్టంగా పోటీని అందిస్తూ ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమ శిక్షనతో చదువుతూ అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయకుమార్ మాట్లాడుతూ .. అన్ని విధాల పాఠశాలకు ప్రజా ప్రతినిధులు మరియు పేరెంట్స్ కమిటీ వాళ్లు అందరు మాకు అండగా ఉంటున్నారని ,ఎటువంటి ఇబ్బందులు వున్న పరిష్కారం చేస్తున్నారని…ఈ అకాడమిక్ లో పదవ తరగతి లో విద్యార్థులను100℅ ఉత్తీర్ణత సాధిస్తామని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమతి, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, జెడ్పిటిసి నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామరవు, ప్రజా ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు , ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్