ముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మోటర్లు స్టార్టర్లు వైర్లు, పైపులు మొదలగున వ్యవసాయ పరికరాలు ఎత్తుకెళ్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొండాపూర్ గ్రామ రైతులు పేర్కొన్నారు.
కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు వెంకన్న అనే రైతు పొలం వద్ద బోరు మోటర్ నుంచి కరెంటు ఫోల్ వరకు ఉన్నటువంటి విద్యుత్ వైర్ ను బుధవారం రోజు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని అది దొంగలపనా లేక ఎవరైనా కావాలని చేస్తున్నారనే అపోహలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతిరోజు ఎవరో ఒక రైతు వ్యవసాయ పొలం వద్ద నుంచి ఎన్నో పరికరాలు దొంగతనానికి గురయ్యా
యని సంబంధిత వ్యవసాయ రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తమ పరికరాలను జాగ్రత్తగా ఉంచుకొని కాపలా కాశి పట్టుకోవాలని స్థానిక రైతులకు వెంకన్న విజ్ఞప్తి చేశారు.




