గజ్వేల్ పట్టణానికి చెందిన గొప్ప రామ భక్తుడు చాకలి రాములు ఆదివారం నాడు మృతి చెందడం భక్త సమాజానికి తీరని లోటు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాటాడుతూ చదువు రాకపోయినా కూడా రామ నామాన్ని లిఖించడమే కాకుండా 5కోట్ల రామ నామాన్ని జప సంఖ్య ద్వారా పూర్తిచేసిన గొప్ప రామ భక్తుడన్నాడు. గత సంవత్సరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నాడన్నాడు. 20 సంవత్సరాలు రామకోటి రామరాజు తో కలిసి హారేరామ భజన రామాలయంలో పాల్గొన్న మహా భక్తుడన్నాడు. ఇలాంటి భక్తుని కోల్పోవడం భక్త సమాజానికి తీరని లోటన్నాడు.
