Breaking News

నేషనల్ అట్రాసిటీ స్ ప్రివెన్షన్ ఫోర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఎస్సి ఎస్టీ లపై అవగాహన సదస్సు

112 Views

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది తెలంగాణ మహానాడు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి మన నాయకుడు ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షుడు బత్తులరాంప్రసాద్ విచ్చేస్తున్నారు కావున అందరూ ఎస్సీ ఎస్టీలు అధిక సంఖ్యలో పాల్గొని నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ జిల్లా సదస్సు ను విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది*స్థలం:చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ అధ్యక్షతన జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పై అవగాహన సదస్సు నిర్వహిస్తూ బాధితులతో ముఖాముఖి నిర్వహించి నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ జిల్లా కమిటీ వేయబడును. కావున ఇట్టి సమావేశంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులు మరియు ఎస్సీ/ ఎస్టీలు అధిక సంఖ్యలో పాల్గొని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అవగాహన సదస్సు మరియు మానవ హక్కుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందున జిల్లాలోని ప్రజా మానవ హక్కుల ఎస్సీ ఎస్టీ ల గురించి పోరాటాలు చేస్తే ఉద్యమ నాయకులు బాధితులుమరియు బాధ్యత గల ప్రతి ఒక్కరూఆదివారం సిరిసిల్లలో జరగబోయే సమావేశంకు తప్పక హాజరు కావాలని కోరుచున్నాము. మాల మహానాడు జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర మాట్లాడుతూ చట్టం తీసేసే విధంగా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నారని మన చట్టాన్ని మనం కాపాడుకోవాలంటే ఐక్యంగా ఉండి పోరాడాలని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బత్తుల రాంప్రసాద్, అన్యాయాలను వారాచకాలను ఎదిరిస్తూ పోరాటం చేస్తున్న రూ కావున జిల్లా సదస్సు విజయవంతం చేయగలరని మనవి చేయుచున్నాను ఎస్సీ/ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ఉండి పోరాడవలసిన సమయం వచ్చినందున ప్రతి ఒక్కరు హాజరై అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం జరుగుతుందిఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గ్యార శంకర్, దోసల రాజు, ఇరిగి పరశురాములు, దోసల ప్రేమ్ కుమార్, తోడటి సుదర్శన్ తుమ్మల మల్లేశం, కొనింటి స్వామి, దువాసిసతీష్, ప్రభాకర్ , పీరయ్య, తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna