• రూ.5 వేల ఆర్థిక సహాయం అందించిన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్.
తంగళ్ళపల్లిమండలంలోని జిల్లెల్ల గ్రామం సోల్ల మల్లయ్య కు చెందిన సుమారు 20 గొర్లు ఆదివారం ఉదయం తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందాయి. దాదాపు రూ.1 లక్ష 50 వేల నష్టం వాటిలినట్లు గొర్రెల రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. విషయం తెలుసుకున్న జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్ , జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు , యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్ , స్థానిక ఎంపీటీసీ చెన్నమనేని వెంకట్రావు లు సోల్ల మల్లయ్యను పరామర్శించి అధైర్య పడవద్దని , అండగా ఉంటామని అన్నారు. తక్షణ సహాయం క్రింద మిరాల భాస్కర్ యాదవ్ సొల్ల మల్లయ్యకు రూ. 5 వేలు ఆర్థిక సహాయంగా అందించాడు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి , ప్రభుత్వం అందించే గొర్రెల పంపిణీ పథకం ద్వారా , తర్వాత విడతలో గొర్రెల యూనిట్ ను వచ్చే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని సోల్ల మల్లయ్యకు హామీ ఇచ్చారు. మల్లయ్యను పరామర్శించిన వారిలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ , బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న , యాదవ సంఘం నాయకులు మందాటి తిరుపతి , తదితరులు ఉన్నారు.
