తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల,రామన్నపల్లె, మండేపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధితో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు లబ్ధిదారుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాట్ల మధు, ఆత్మకూరి రంగయ్య,గనప శివజ్యోతి, ఎంపిటిసి బుస్స స్వప్న లింగం,ఉప సర్పంచ్ నర్ర సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోమిటి రాజిరెడ్డి, మండల కో ఆప్షన్ తాజ్,మైనార్టీ మండల అధ్యక్షుడు రషీద్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క రవి,కడారి శ్రీనివాస్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంజీవ్,గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
